శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (15:18 IST)

ఆ కుర్రోడు మంచి రసికుడే... నిన్న శ్రీదేవి కుమార్తె.. నేడు అమితాబ్ మనవరాలు!

సుశీల్ కుమార్ షిండే. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర హోంశాఖామంత్రిగా, ఏపీ గవర్నర్‌గా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నేత. ప్రస్తుతం

సుశీల్ కుమార్ షిండే. రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర హోంశాఖామంత్రిగా, ఏపీ గవర్నర్‌గా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నేత. ప్రస్తుతం ఈయన పేరు కంటే ఈయనగారి మనువడు శిఖర్ పహారియా పేరు బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఏంటో ఇప్పటికే అర్థమైవుంటుంది. 
 
నిన్నటికినిన్న బాలీవుడ్ నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవితో లిప్‌లాక్ కిస్సుల్లో మునిగి తేలిన ఈ కుర్రోడు.. ఇపుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో అత్యంత చనువుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
నిజానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం నిత్యం వార్తల్లో ఉండాలంటే ఏదో ఒక సంచలనం చేస్తూ ఉండాలి. కానీ, ఈ కుర్రోడు మాత్రం అలాంటిదేం లేకుండానే మంచి పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు. తాజాగా తాకిన లిప్ మళ్లీ తాకకూడదనుకున్నాడో ఏమో గానీ కొత్తగా ట్రై చేశాడు. 
 
ఇటీవల శ్రీదేవి కుమార్తె జాహ్నవితో అత్యంత సన్నిహితంగా మెలగడమే కాక, ఆమె లిప్ లాక్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు అమితాబ్ మనువరాలితో ఉన్న ఫొటోలు కూడా నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో చూస్తే ఇతగాడు నందాతో డేటింగ్ చేస్తున్నాడా? అనే అనుమానాలు కలగక మానవు. 
 
ఇంతకీ ఈ శిఖర్ ఎవరో కాదు.. సైఫ్ అలీఖాన్ అందాల కుమార్తెతో డేటింగ్ చేస్తున్న వీర్ పహారియా తమ్ముడే. ఈ అన్నదమ్ముల వ్యవహారం చూస్తుంటే.. చిన్నతనం నుంచే మాంచి రసికులుగా పేరు సంపాదించడానికి గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా అనిపిస్తోంది.