Dharma Sangrah
✕

నెల్సన్‌తో అల్లు అర్జున్ సినిమా.. పుష్ప-2 తర్వాత ప్రారంభం

Written By సెల్వి
Updated: సోమవారం, 15 జులై 2024 (12:36 IST)
Allu Arjun_Nelson
తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. 'జైలర్ 2' కోసం తన పనిని పూర్తి చేసి బన్నీ కోసం నెల్సన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఈ సంవత్సరం చివరి నుండి ఈ ఇద్దరు కలిసి పని చేస్తారని తెలుస్తోంది. 'జైలర్' భారీ విజయం తర్వాత, నెల్సన్ హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌తో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. బన్నీ వెంటనే కథకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
నెల్సన్ ఒక ప్రత్యేకమైన నేపథ్యంతో తగినంత యాక్షన్, వినోదంతో కూడిన ఆసక్తికరమైన కథను వివరించాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప' తర్వాత భారతదేశం అంతటా పాపులారిటీ సంపాదించినందున ఇది పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడుతుంది.
 
'పుష్ప2' తర్వాత అతని క్రేజ్ మరింత పెరిగే అవకాశం వుంది. బన్నీ ఇతర ప్రాజెక్ట్‌ల కంటే ముందు నెల్సన్ సినిమా చేయబోతున్నాడని ఫిలిమ్ వర్గాల సమాచారం. 
 
గతంలో అల్లు అర్జున్‌తో బ్లాక్‌బస్టర్ ‘రేసుగుర్రం’ చిత్రాన్ని నిర్మించి, అల్లు అర్జున్‌ని కొత్త కోణంలో చూపించిన నల్లమల్లపు బుజ్జి ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.

అన్నీ చూడండి

తమిళనాడులో ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తుల మృతి

సీఈవోగా జెన్సన్ హువాంగ్ పునరాగమనం - ఎన్విడియాకు కాసుల వర్షం

టైట్ హగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా ఉద్యోగుల ఘన స్వాగతం (Video

ఎర్ర సముద్రంపై వైమానిక దాడులు.. 17మంది కార్మికులు మృతి

వారణాసిలో దేవ దీపావళి వేడుకలు... 11లక్షలకు పైగా దీపాలు

అన్నీ చూడండి

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

తర్వాతి కథనం
Show comments