Niharika: విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన నీహారిక కొణిదెల
Niharika - Nagababu
అప్పట్లో ఆ వార్తల వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ ఆమె తనకు చెల్లెలులాంటిదని క్లారిటీ ఇచ్చాడని గుర్తు చేసుకుంది. ఎదుకంటే మా నాన్నగారితో గీత గోవిందం సినిమాలో తండ్రిగా పనిచేశారు. అందుకే తాను చెల్లెలు అవుతానని చెప్పాడని తెలిపింది. అయితే ఈ న్యూస్ మరోసారి వార్తల్లోకి రావడం వెనుక రాకాస సినిమా ప్రమోషన్ కు లాభిస్తోందేమోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక రాకాస సినిమా గురించి చెప్పాలంటే, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో కూడింది. రాకాస అనేది ఎవరు? అనేది సినిమాలో తెలుసుకోవాలని నిహారిక తెలుపుతోంది. నయన్ సారిక నాయికగా నటించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
