చిరంజీవి అక్కడికి రానన్నారట... నిహారిక ఫీలవుతోందట... పెదనాన్న ప్రాబ్లమ్ ఏంటో...?
చిరంజీవి తన కుటుంబంలోని నటులు నటిస్తే వారికి సపోర్ట్‌గా నిలుస్తుంటాడు. మెగా కుటుంబం నుంచి ఏకంగా ఆరుగురు హీరోలు వుండగా, ఇప్పుడు కొత్తగా నటి రాబోతుంది. ఆమె నాగబాబు కుమార్తె నీహారిక. ఇది తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమా చక్కటి ప్రేమకథతో రూపొందుతోంది. ఇం
చిరంజీవి తన కుటుంబంలోని నటులు నటిస్తే వారికి సపోర్ట్‌గా నిలుస్తుంటాడు. మెగా కుటుంబం నుంచి ఏకంగా ఆరుగురు హీరోలు వుండగా, ఇప్పుడు కొత్తగా నటి రాబోతుంది. ఆమె నాగబాబు కుమార్తె నీహారిక. ఇది తెలిసిందే. ఆమె నటిస్తున్న సినిమా చక్కటి ప్రేమకథతో రూపొందుతోంది. ఇంతకుముందు టీవీ9లో ఆమె పని చేయడంతో.. ఆ సంస్థ పార్టనర్‌గా సినిమా తీసింది. ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. 'ఒక మనసు' పేరు పెట్టారు. దర్శకుడు రామరాజు 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రాన్ని ఇంతకుముందు దర్శకత్వం వహించాడు.
సునీల్ కాశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియోను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో అభిమానులు, మెగా ఫ్యామిలీ సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ ఆడియోను చిరంజీవి చేతుల మీదుగా జరపాలని అందరూ భావించారు. ఇప్పటికే ఫ్యాన్స్‌కు సంకేతాలు పంపారు. అయితే... చిరంజీవి తన 150వ సినిమా గెటప్ కోసం ప్రత్యేకంగా గెడ్డాలు పెంచి.. వుండటంతో... ఆ లుక్ బయటకు వస్తుందేమోననీ కాస్త ఇబ్బందిపడుతున్నారట.
వీలుంటే వస్తానన్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో నీహారిక కలత చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. చిరును వచ్చేలా చేయడానికి ట్రై చేస్తున్నారు. 99 శాతం వచ్చేట్లు వున్నాడనీ.. నటిగా ఆమెను గుర్తించి.. గౌవరం ఇవ్వాలని సన్నిహితులు సూచించినట్లు తెలిసింది. ఇక పవన్ ఇప్పటికే విదేశాల్లో వుండటంతో.. తన రాక అనుమానమే. మిగిలిన కుర్ర హీరోలు వచ్చేందుకు సిద్ధమయ్యారు.