Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు
సింహంతో ఓ వ్యక్తి ఆటలాడాడు. అయితే పంజా దెబ్బ తప్పలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. నీలిరంగు షర్టు ధరించిన ఓ వ్యక్తి సింహం ఉండే బోను దగ్గరకు వచ్చాడు. సింహంతో ఆటలు ఆడటం మొదలెట్టాడు. దాని ముక్కుపై వేలితో గిల్లటం మొదలెట్టాడు. అది కోపంతో గుర్రుమంటూ ఉంది. అయినా ఆగకుండా దాన్ని ఆట పట్టిస్తూనే వున్నాడు.
అది తన పంజాతో అతడిని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ వుంది. కొన్నిసార్లు దాని అటాక్ నుంచి చాలా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే చివరికి పంజా దెబ్బతో అటాక్ చేసింది.
అది బ్లేడు లాంటి తన పదునైన గోర్లను అతడి చేతిలోకి దింపింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. సింహంతో పొరపాటున కూడా ఆటలాడకూడదని హెచ్చరిస్తున్నారు.