ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (10:48 IST)

ఇంట్లోనే హనీమూన్ ... పెళ్లయిన మూడో రోజే షూటింగ్ : సమంత

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగ చైతన్య, సమంతల పెళ్లి వచ్చే నెల ఆరో తేదీన గోవాలో జరుగనుంది. ఆ తర్వాత వారి హనీమూన్‌పై మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత మూడు నెలల పాటు నూతన దంపతులు హనీమూన

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగ చైతన్య, సమంతల పెళ్లి వచ్చే నెల ఆరో తేదీన గోవాలో జరుగనుంది. ఆ తర్వాత వారి హనీమూన్‌పై మీడియాలో వివిధ రకాల కథనాలు వస్తున్నాయి. పెళ్లయిన తర్వాత మూడు నెలల పాటు నూతన దంపతులు హనీమూన్స్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. దీనిపై సమంత స్పందించింది. 
 
అన్ని అవాస్తవాలని తెలిపింది. తమ పెళ్లి ఆగస్టు 6న జరిగే విషయం నిజమే. గోవాలో తమ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సామాన్యంగా జరుగుతుందని పేర్కొంది. తాము నటనకు దూరంగా సెలవు తీసుకొని విదేశాలకు వెళ్లడం లేదని స్పష్టం చేసింది. పెళ్లైన మూడో రోజు నుంచి తను చైతన్య షూటింగ్‌లలో పాల్గొంటున్నామని, అందువల్ల పెళ్లి తర్వాత జరిగే తంతు అంతా ఇంట్లోనే జరుగుతుందని ఆమె సూచన ప్రాయంగా తెలిపింది.