శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 జనవరి 2017 (18:35 IST)

చెర్రీతో నో ఛాన్స్... సమంతకు అది ఫిక్సయిపోయిందట...

రామ్ చరణ్ తదుపరి చిత్రం నుంచి అనుపమా పరమేశ్వర్‌ను తీసేసిన పిదప సమంతను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదంటున్నారు టాలీవుడ్ సినీజనం. దానికీ ఓ కారణం చెపుతున్నారు. అదేంటయా అంటే సమంత-నాగచైతన్యల నిశ్చితార్థం. వీరిద్దరి నిశ్చితార్థం అప్

రామ్ చరణ్ తదుపరి చిత్రం నుంచి అనుపమా పరమేశ్వర్‌ను తీసేసిన పిదప సమంతను ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదంటున్నారు టాలీవుడ్ సినీజనం. దానికీ ఓ కారణం చెపుతున్నారు. అదేంటయా అంటే సమంత-నాగచైతన్యల నిశ్చితార్థం. వీరిద్దరి నిశ్చితార్థం అప్పుడు జరుగుతుందీ, ఇప్పుడు జరుగుతుందీ అంటు ఏవేవో వార్తలు వచ్చాయి. 
 
చివరికి ఈ నెల 29న సమ్ము-చైతుల నిశ్చితార్థం అంటూ సమాచారం వస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇక సమంత సినిమాలకు రెడ్ సిగ్నల్ చూపించడం ఖాయం. కాగా రామ్ చరణ్ తన తదుపరి చిత్రంలో సమంతను హీరోయిన్‌గా బుక్ చేయాలని కోరినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకున్నారు. ఈ వార్తతో చెర్రీతో సమంత నటించే అవకాశం లేదని అంటున్నారు.