మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:12 IST)

పవన్‌ కళ్యాణ్ ఈసారి మరో పుస్తకం రాస్తాడా?

నటుడు పవన్‌ కళ్యాన్‌ ఇంతకుముందు 'ఇజం' అంటూ రాసి.. తన జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ పుస్తకం ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉండటంతో కామన్‌మ్యాన్‌ చదివేందుకు వీలుపడలేదు.

నటుడు పవన్‌ కళ్యాన్‌ ఇంతకుముందు 'ఇజం' అంటూ రాసి.. తన జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ పుస్తకం ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉండటంతో కామన్‌మ్యాన్‌ చదివేందుకు వీలుపడలేదు. తర్వాత కొద్ది పుస్తకాలు తెలుగులో వచ్చినా.. అవి చదివి అర్థం చేసుకునేందుకు ఫ్యాన్స్‌ శతవిధాలా ప్రయత్నించారు. ఎక్కువభాగం సోషలిజం కాన్సెప్ట్‌తో కూడిన పదాలే ఉండడం విశేషం. స్వతహాగా పుస్తకాలు ఎక్కువగా చదివే పవన్‌.. త్రివిక్రమ్‌ సాంగత్యంతో మరింతగా ఎక్కువ చదివేందుకు సాధ్యపడింది. 
 
ఈసారి తనను 'జోనాథన్‌ లివింగ్‌ స్టన్‌సీగల్‌' అనే పుస్తకాన్ని తన సోదరుడు నాగబాబు చదవమని చెప్పాడని వపన్‌ వెల్లడించారు. సముద్రాలపై ఎగిరే పక్షి సీగల్‌ జీవితం. కరెక్ట్‌గా చెప్పాలంటే.. స్వయం కృషితో ఎలా ఎదగాలనే ఫిలాసఫికల్‌ బుక్‌ అది. దాన్ని అర్థం చేసుకోవడం.. దాన్ని ఆచరణలో పెట్టడం కష్టమైనపనే. బిజీ లైప్‌లో అందరికీ సాధ్యంకాకపోవచ్చు. కానీ అటు రాజకీయంగా, ఇటు సినిమాలపరంగా బిజీగా వున్న పవన్‌ చదివి.. దాన్ని తన కోణంలో మరో పుస్తకం రాస్తాడేమోనని ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు.