సీరియస్ అయిన పవన్.. శ్రుతిహాసన్‌కు క్లాస్ పీకారా..?
గబ్బర్ సింగ్‌తో ఐరెన్ లెగ్ కాకుండా గోల్డెన్ లెగ్‌గా పేరు కొట్టేసిన శ్రుతిహాసన్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్‌తో ‘కాటమరాయుడు’ మూవీలో నటిస్తోంది. కానీ తొలి సినిమాతో పోల్చుకుంటే పవన్‌తో శృతి బాగా క్లోజ
గబ్బర్ సింగ్‌తో ఐరెన్ లెగ్ కాకుండా గోల్డెన్ లెగ్‌గా పేరు కొట్టేసిన శ్రుతిహాసన్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్‌తో ‘కాటమరాయుడు’ మూవీలో నటిస్తోంది. కానీ తొలి సినిమాతో పోల్చుకుంటే పవన్‌తో శృతి బాగా క్లోజ్ అయిందట. దీంతో మూవీ సెట్‌లో పవన్‌తో అన్ని విషయాలు మాట్లాడుతోందట. ఈ క్రమంలో తాను దక్షిణాది సినిమాలకు దూరమవ్వాలనుకుంటున్నట్లు పవన్‌కు చెప్పిందట శృతిహాసన్. అలా చెప్పడంతో పవన్ కల్యాణ్ కాస్త సీరియస్ అయ్యాడని తెలిసింది. అంతేగాకుండా శ్రుతిహాసన్‌కు క్లాస్ పీకాడట.
బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమా ఎంతో గొప్పదని, గతంలో ఎంతోమంది కథానాయికలు బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగినప్పటికీ దక్షిణాది మూవీస్‌లో నటించడం మానలేదని చెప్పుకొచ్చారట. చిత్రసీమలో సుదీర్ఘకాలంపాటు హీరోయిన్‌గా కొనసాగలనుకుంటే దక్షిణాది సినిమాలను నెగ్లెక్ట్ చేయకూడదని హితబోధ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాలీవుడ్ చిత్రసీమలో ఉన్న లోపాలను కూడా శృతికి పవన్ వివరించాడట. దీంతో ప్రస్తుతం శృతిహాసన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పవన్ సలహాతో శృతి ఎలాంటి నిర్ణయానికి వస్తుందో చూడాలి.