శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:33 IST)

గూగుల్‌కే షాకిచ్చిన సెక్స్ బాంబ్ పూనమ్ పాండే... నా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించండి!

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు తేరుకోలేని షాకిచ్చారు. అభిమానులకు మరింత చేరువ కావడానికి పూనమ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. అయితే, ఇందులో అశ్లీల, అసభ్యకర పోస్టులు ఉండ

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు తేరుకోలేని షాకిచ్చారు. అభిమానులకు మరింత చేరువ కావడానికి పూనమ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. అయితే, ఇందులో అశ్లీల, అసభ్యకర పోస్టులు ఉండటంతో దానిపై గూగుల్ నిషేధం విధించింది. ఈ విషయం తెలుసుకున్న పూనమ్ పాండే గూగుల్‌పై మండిపడింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ... ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో పెద్దలకు మాత్రమే అనే రీతిలో ఉండే ఎన్నో మ్యాగజైన్లు ఉన్నాయి. కానీ, నా యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గూగుల్ ఎందుకు బ్యాన్ చేసిందో అర్థం కావడం లేదు. పైగా తన యాప్‌లో అసభ్యకరమైన ఫొటోలు పెట్టలేదని వివరించారు. ఈ విషయంపై నా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అదేసమయంలో నా యాప్‌ను గూగుల్ తొలగించింది. కానీ అండ్రాయిడ్ యూజర్లు 'ది పూనమ్‌పాండే' యాప్‌ను నా వెబ్‌సైట్ నుంచి డైరెక్టుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా తాను పోస్ట్ చేసే వాటిని నిశ్చింతగా వీక్షించవచ్చని పూనమ్ ట్వీట్ చేసింది.