గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (20:21 IST)

ఆ విషయంలో తండ్రిని మించిపోయిన అకీరా...?

త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా కోసం బల్గేరియన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాదుకు తిరిగి వచ్చారు. తిరుగు ప్రయాణంలో దుబాయ్‌లో పవన్ తన పిల్లల

త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా కోసం బల్గేరియన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హైదరాబాదుకు తిరిగి వచ్చారు. తిరుగు ప్రయాణంలో దుబాయ్‌లో పవన్ తన పిల్లలు అకీరా, ఆద్యా, సతీమణి అన్నాతో మెరిశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీర తన తల్లి, చెల్లితో కలసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. 
 
ఈ మధ్య పవన్ తన కుమారుడు, కుమార్తెతో కలసి ఎక్కడకో నడుకుంటూ వెళ్తున్న ఫొటోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫొటోలో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏమిటంటే... తన తండ్రి కన్నా అకీరా ఎంతో ఎత్తు పెరిగిపోయాడు. 
 
అకీరా వయసు 13 ఏళ్లే అయినా... ఎత్తులో మాత్రం అప్పుడే తన తండ్రిని మించిపోయాడు. ఇక షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఈ నెలాఖరున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఉద్దానం సమస్యపై ఈ సందర్భంగా పవన్ సీఎంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.