శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (12:56 IST)

ఆ ఒక్కదానికోసం రూ.5.50 కోట్లు వదులుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్!

బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అంతేకాదు పారితోషికం కూ

'బాహుబలి' సినిమాతో ప్రభాస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారట. అంతేకాదు పారితోషికం కూడా అడిగినంత ఇవ్వ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి-2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఓ సుజిత్ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నాడు.  
 
అయితే ప్రభాస్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభాస్ ఓ బ్రాండ్ అయిపోయాడు. దీనికి ముఖ్య కారణం... ప్రభాస్ ఫిజిక్ ఫిట్నెస్. కాబట్టి ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఓ ఫిట్నెస్ బ్రాండ్ ప్రభాస్‌ని సంప్రదించిందట. తమ ప్రొడక్ట్స్‌కి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరింది. ఇందుకోసం ఆ కంపెనీ ఆఫర్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? 5.5 కోట్ల రూపాయలు. కానీ ఆ ఆఫర్‌ని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించాడట.
 
 ప్రస్తుతం తన దృష్టి అంతా బాహుబలిపైనే ఉందని, కొన్నాళ్ళ వరకు మరే దానిపైన దృష్టి పెట్టనని తేల్చి చెప్పాడు. బాహుబలి చిత్రంలో రెండు విభిన్న పాత్రలలో ప్రభాస్ కనిపించనుండగా.. దీని కోసం తన దేహధారుడ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ప్రభాస్ పడుతున్న ఈ కష్టానికి బాహుబలి ది కంక్లూజన్ ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని సినీ పండితులు అంటున్నారు.