Daily Horoscope
✕

ఆదిపురుష్‌ను వాయిదా వేసిన ప్ర‌భాస్‌

Written By డివి
Updated: శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:14 IST)
Prabhas adipurush
ప్ర‌భాస్ సినిమాలు చ‌క‌చ‌క‌గా షూటింగ్‌లో వున్నాయి. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి జ‌రుగుతున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలలో బిజీగా వున్నాడు. ఇటీవ‌లే ఆదిపురుష్ సినిమా సెట్‌పైకి వెళ్లింది. అయితే మొద‌టి రోజే సెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో వాయిదా ప‌డింది. భారీగా న‌ష్టంతోపాటు సెట్ రూపు రేఖ‌లు మారిపోయాయి. అందుకే దానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. అందులోని ప‌రిక‌రాల‌ను విదేశాల‌నుంచి తెప్పించాల్సి వుంది.

క‌నుక ఆ చిత్రాన్ని వాయిదా వేశాడు ప్ర‌భాస్‌. ఇందులో శ్రీ‌రాముడి పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తున్నాడు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఆ డేట్స్‌ను `స‌లార్‌` సినిమాకు ఉప‌యోగించుకోన్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే స‌లార్ షూటింగ్ ముందు అనుకున్న‌ట్లుగాకుండా ఎర్లీగా జ‌రుగుతోంది. విడుద‌ల తేదీ కూడా మారుతుందేమో చూడాలి.

అన్నీ చూడండి

గుజరాత్‌లో ఘోరం - ట్రక్కును ఢీకొన్న కారు - ఏడుగురు మృతి

ఆన్‌లైన్‌‍ గేమ్‌లో పరిచయం - కిడ్నాప్ బాలికను సురక్షితంగా రక్షించిన తల్లీకొడుకు

ప్రజలు తన మాట వినడం వల్లే బంగారం ధరలు దిగివచ్చాయి : ప్రధాని మోడీ

కీలక నిర్ణయం తీసుకున్న బాబు సర్కారు - అడంగల్ పత్రాలు నేరుగా ఇంటికే..

పేదరికాన్ని జయంచిన విద్యార్థిని - అమెజాన్ రూ.45 లక్షల వార్షిక ప్యాకేజీ

అన్నీ చూడండి

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

తర్వాతి కథనం
Show comments