ప్రగ్యా జైస్వాల్.. నా గర్ల్ ఫ్రెండ్.. మంచు విష్ణు ఎందుకలా అన్నాడు..?
''కంచె'' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా యూనిట్ సభ్యులు ఎంపిక చేశారు. ''కంచె''లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను
''కంచె'' హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా యూనిట్ సభ్యులు ఎంపిక చేశారు. ''కంచె''లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్‌లో మెరవనుందో ఆసక్తిగా మారింది.
అంతేకాదు మంచు మనోజ్ చిత్రంతో పాటూ ప్రగ్యా నాగార్జున భక్తి చిత్రమైన ''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ భామ గురించి ఓ ఆసక్తికర వార్త వెలువడింది. ఈ భామ పెళ్ళైన హీరోని ప్రేమిస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై ఆమె నుంచి సమాధానం రాకపోయినా, ఆ హీరో మాత్రం పబ్లిక్‌గా ప్రగ్యాజైస్వాల్ నా గర్ల్ ఫ్రెండ్ అనేశాడు... ఆ వివరాల్లోకి వెళితే... ఇటీవల విశాఖపట్నంలో మోహన్ బాబు 40 ఇయర్స్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకలో మంచు మనోజ్ మాట్లాడుతూ...'ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ప్రగ్యా మాట్లాడుతుంది' అని అన్నాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయినది ప్రగ్యా. నవ్వుతూనే మైక్ పట్టుకొని స్పీచ్ ఇరగదీసింది. ఎందుకంటే ప్రస్తుతం మనోజ్, ప్రగ్యా కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ అనుబంధంతోనే మనోజ్ అలా అనుంటాడని అందరూ నవ్వుకున్నారు.