గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (13:58 IST)

నిత్యాకు ఫుల్‌గా క్లాస్ పీకిన టాలీవుడ్ బడా నిర్మాత ఎవరు?

మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ ఎంపికైంది. కాగా నిత్యామీనన్ నటనలో ఎంత మంచి పేరు తెచ్

మ‌హాన‌టి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ ఎంపికైంది. కాగా నిత్యామీనన్ నటనలో ఎంత మంచి పేరు తెచ్చుకుందో తన బిహేవియర్‌తో అంతకన్నా ఎక్కువ నెగెటివ్ పేరునే సంపాదించుకుంది.
 
స‌హ‌జంగా ఈ అమ్మ‌డుకి పొగ‌రుగా ఎక్కువగా ఉంటుంద‌ని, ఎవ‌రినైనా తీసిపారేసేలా మాట్లాడుతుంద‌ని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన టాలీవుడ్ నిర్మ‌ాత అశ్వ‌నీద‌త్... నిత్యాకి ఫుల్‌గా క్లాస్ తీసుకున్నాడ‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం నిత్యా...ముక్కుసూటిగా మాట్లాడుతుందని కొంత మంది దత్‌కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారట. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాత అశ్వనీదత్ నిత్యను పిలిపించి మాట్లాడాడట.
 
''షూటింగ్‌కు సరైన సమయంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా రావాల‌ని, డైరెక్టర్ పనుల్లో ఏమాత్రం వేలు పెట్టకూడదని గట్టిగా చెప్పాడట. అంతేకాదు, సినిమా ప్రమోషన్‌కు కూడా త‌ప్ప‌నిస‌రిగా స‌హ‌క‌రించాల్సిందేన‌ని చెప్పాడట. ఇక ప్రమోషన్‌కు సహకరించకపోతే రెమ్యునరేషన్‌లో కోత కూడా పెట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించాడట''. దీనికి తలాడించిన నిత్యామీన్... మరి షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి తలతిక్క వేషాలు వేస్తుందో చూడాల్సివుంది.