శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (09:02 IST)

నేనింకా ఆ వయసు దాటలేదు.. నా మాట నమ్మండి : రాయ్ లక్ష్మి

టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్‌లతో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో రాయ్‌లక్ష్మి. ఐటమ్ సాంగ్‌లతో కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది. అయితే, ఈ అమ్మడు వయసుపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. దీంతో ఆమ

టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్‌లతో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో రాయ్‌లక్ష్మి. ఐటమ్ సాంగ్‌లతో కుర్రకారుకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతోంది. అయితే, ఈ అమ్మడు వయసుపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. దీంతో ఆమె స్పందించింది. 
 
"ఎదుటివారిని చూడగానే ఎవరికైనా కొన్ని అభిప్రాయాలు కలుగుతుంటాయి. అన్ని సందర్భాల్లోనూ అవి వాస్తవం కావాలనే నియమమేమీ లేదు. కొన్నిసార్లు కాకనూ పోవచ్చు" అని అంటోంది. 'నన్ను చూసిన వాళ్లు చాలా మంది నాకు 30 ఏళ్లు దాటేశాయని అనుకుంటారు. 
 
కానీ నాకు 26 ఏళ్లు పూర్తయ్యాయంతే. ఈ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కావాలని వయసు దాచుకుంటున్నానని అనుకుంటారు. నా 15 ఏళ్లప్పుడు తొలి సినిమా ‘కర్క కసడర’ అనే చిత్రంలో నటించాను. నా మాతృభాష తుళు కాదు. నాకు తుళులో ఒక్క ముక్క కూడా మాట్లాడటం రాదు' నేను చెప్పే విషయాలు నిజం అని వివరించారు.