న్యూడ్ వీడియోను కళ్లార్పకుండా చూసి... మళ్లీ విమర్శలా... రాధికా ఆప్టే ఫైర్
అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా యాదవ్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో 'పార్చ్ డ్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే నగ్నంగా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ లీక్ అయింది. ఈ వీడియోలో రాధి
అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా యాదవ్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో 'పార్చ్ డ్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో రాధిక ఆప్టే నగ్నంగా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ సీన్ లీక్ అయింది. ఈ వీడియోలో రాధికా ఆప్టే నగ్నంగా కనిపించడంతో పాటు తన కోస్టార్ అదిల్ హుస్సైన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు కుర్రకారుని రెచ్చగొట్టేలా ఉన్నాయి.
3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వీడియోని రాధికానే కావాలనే పబ్లిసిటీ కోసం లీక్ చేసిందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ పోర్న్ సినిమాను తలపించేలా ఉన్నాయని కొందరు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై రాధిక తనదైన శైలిలో స్పందించింది. ''తన న్యూడ్ వీడియోలకు రోజులో లక్ష వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో జనాలు చూస్తున్న వీడియోను విమర్శించడం ఏంటని ప్రశ్నించింది.
ఇక తన న్యూడ్ వీడియోను కళ్లార్పకుండా చూసిన వారే ఆ తర్వాత విమర్శలు చేస్తున్నారు అని ఈ హాట్ బ్యూటీ మండిపడుతోంది. న్యూడ్ వీడియో అంటే ఇష్టంతో చూసి, ఆ తర్వాత విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని, తన వృత్తి ధర్మం పాటించి నటించాను తప్ప, తనకు తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదు అని ఈ భామ చెప్పుకొచ్చింది. అంతే కాదు ముందు ముందు ఇలాంటి సీన్స్‌లో నటించేందుకు ఏ మాత్రం వెనుకాడను అని తెగేసి చెప్పింది.