శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 29 జులై 2017 (03:05 IST)

ప్రభాస్‌తో కమర్షియల్ మూవీ కోసం కథ రెడీ చేసిన రాజమౌళి.. 2018లో షూటింగ్ ప్రారంభం

తెలుగు సినిమాకు అంతర్జాతీయ ప్రతిష్ట తీసుకొచ్చిన బాహుబలి 2 సినిమా అద్భుత విజయం తర్వాత గత 3 నెలలుగా సైలెంటుగా ఉన్న రాజమౌళి.. ప్రభాస్ కోసం మరో కథ రెడీ చేసినట్లు తాజా వార్త. అటు ప్రభాస్, ఇటు రాజమౌళి ముందే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాక 2018వ సంవత్సరం

తెలుగు  సినిమాకు అంతర్జాతీయ ప్రతిష్ట తీసుకొచ్చిన బాహుబలి 2 సినిమా అద్భుత విజయం తర్వాత గత 3 నెలలుగా సైలెంటుగా ఉన్న రాజమౌళి.. ప్రభాస్ కోసం మరో కథ రెడీ చేసినట్లు తాజా వార్త. అటు ప్రభాస్, ఇటు రాజమౌళి ముందే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేశాక 2018వ సంవత్సరంలో ప్రభాస్‌తో రాజమౌళి సినిమా తీయనున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ టైమ్‌లో డిస్కస్‌ చేసిన కథతో ప్రభాస్, రాజమౌళి సినిమా చేస్తారని తెలుస్తోంది.
 
విషయానికి వస్తే.. బాహుబలి టైమ్‌లో... బాహుబలి కోసం... జక్కన్న టూకీగా ఓ కథను రెడీ చేశారు. బాహుబలితో కథ గురించి, అందులో క్యారెక్టర్స్‌ గురించి డిస్కస్‌ కూడా చేశారట. బాహుబలికీ కథ బాగా నచ్చేసిందట! కానీ, త్వరగా సినిమా స్టార్ట్‌ చేయడానికి ఓ చిక్కొచ్చింది. బాహుబలి అలియాస్‌ ప్రభాస్‌కు, జక్కన్న అలియాస్‌ రాజమౌళికు తమ తమ నెక్ట్స్‌ కమిట్‌మెంట్స్‌ గుర్తొచ్చాయట. ముందు ఆ కమిట్‌మెంట్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చేస్తున్నారు. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక, ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు.
 
ఈ రెండింటిని మహా అయితే ఏడాదిలో పూర్తి చేస్తారు. అంత కంటే ఎక్కువ టైమ్‌ పట్టే ఛాన్సే లేదు. ‘బాహుబలి–2’ తర్వాత ఇంకా మరో సినిమా స్టార్ట్‌ చేయని రాజమౌళి ఈలోపు ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఎవరి సినిమాలు వారు పూర్తి చేశాక... ఏడాది తర్వాత ‘బాహుబలి’ టైమ్‌లో డిస్కస్‌ చేసిన కథతో ప్రభాస్, రాజమౌళి సినిమా చేస్తారట. అయితే... ఈ కథ బాహుబలి టైపులో రాజులు, యుద్ధాలకు సంబంధించినది కాదట! ఈసారి ప్రభాస్‌ కోసం రాజమౌళి పక్కా కమర్షియల్‌ పాయింట్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.