వామ్మో.. రాజమౌళి బాహుబలి కోసం రూ. 100 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడా?
రాజమౌళి సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి ఎంతటి సంచనాలు సృష్టిస్తుందో... ఆయన తీసుకునే పారితోషికం కూడా అంతే సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'బాహ
రాజమౌళి సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి ఎంతటి సంచనాలు సృష్టిస్తుందో... ఆయన తీసుకునే పారితోషికం కూడా అంతే సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'బాహుబలి- 2' . ఈ సినిమా కోసం రాజమౌళి భారీ పారితోషికాన్ని అందుకున్నట్టు టాలీవుడ్ వర్గాల విశ్వయనీయ సమాచారం.
రాజమౌళి తీసే సినిమాకు సంవత్సరాల కొద్ది సమయం పడుతుంది. ఈయన తీసే అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అని అందరికి తెలిసిందే. ఈయన తీసే సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టడానికైనా నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. బాహుబలి మొదటి సినిమా ఏకంగా 600 కోట్ల వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ''బాహుబలి'' మొదటి పార్ట్‌కి రాజమౌళి ఏకంగా రూ. 25 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ''బాహుబలి- 2'' చిత్రం కోసం జక్కన్న తీసుకుంటున్న పారితోషికం గురించి తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. దాదాపు 90 నుండి 100 కోట్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి మొదటి స్థానంలో నిలిచాడు.