మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 5 జనవరి 2019 (21:48 IST)

దమ్ముంటే నాపై అలాంటి యత్నం చేసి చూడండి... పగిలిపోద్ది...

రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకిలా అంటున్నారో అర్థం కావడం లేదు కదా. గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక దాడులపై రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగానే స్పందించారు. అది కాస్త సినీపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ రకుల్ ప్రీత్ సింగ్ ప్రకటనలు చేశారు.
 
అయితే గత నెలరోజుల వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై రకుల్ స్పందించింది. ట్విట్టర్ వేదికగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరికైనా ధైర్యం ఉంటే తనపై అలాంటి ప్రయత్నం చేసి చూడండి.. మరోసారి మహిళల దగ్గరకు వెళ్ళకుండా ఎలా బుద్ధి చెప్పాలో చూపిస్తానంటోందట. 
 
ఇప్పటికే జిమ్‌లో ఫుల్ ఫిట్‌తో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆపద సమయంలో శత్రువును ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసుకుందట. అందుకే అంత ధైర్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రకటనలను చేస్తోందట. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వరుస అకృత్యాలపై రకుల ప్రీత్ సింగ్ ప్రకటనలు చేయడం సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.