శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (12:11 IST)

అనుపమ పరమేశ్వరన్ అవుట్.. చెర్రీతో సమంత రొమాన్స్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నాగచైతన్యతో పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సమంత మెగా హీరోతో కలిసి నటించనుందని వార్తలు వస్తున్నాయి. 'ధ్రువ'తో హిట్ కొట్టేసిన చరణ్, తన తదుపరి సినిమాకి రెడీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నాగచైతన్యతో పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో సమంత మెగా హీరోతో కలిసి నటించనుందని వార్తలు వస్తున్నాయి. 'ధ్రువ'తో హిట్ కొట్టేసిన చరణ్, తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. చరణ్ తదుపరి సినిమా సుకుమార్‌తోననే సంగతి తెలిసిందే. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి 
 
ఈ చిత్రంలో చెర్రీ సరసన అందాల రాశి సమంతను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వస్తోంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాలో అనుపమ చేయడం లేదనే టాక్ వచ్చింది. మరి అనుపమ ప్లేస్‌లో సమంతను హీరోయిన్‌గా ఖరారు చేశారా..? లేకుంటే తొలి  హీరోయిన్‌గా సమంతను తీసుకున్నారా? అనే దానిపై ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన ప్రారంభిస్తారని తెలుస్తోంది.