1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:15 IST)

'జనతా గ్యారేజ్‌'ను వెనక్కి నెట్టేసిన రామ్ చరణ్ 'ధృవ'.. టాప్ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

ఇటీవలి కాలంలో టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా 'జనతా గ్యారేజ్' అనడంతో సందేహం అక్కర్లేదు. టైటిల్ దగ్గర్నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్‌లో వేగం, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్నివిధాలా ఆకట్టు

ఇటీవలి కాలంలో టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా 'జనతా గ్యారేజ్' అనడంతో సందేహం అక్కర్లేదు. టైటిల్ దగ్గర్నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్‌లో వేగం, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్నివిధాలా ఆకట్టుకున్న 'జనతా గ్యారేజ్' పట్ల అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమాపై టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది జనతా గ్యారేజ్. 
 
అయితే, ఇటువంటి హంగామా ఏమీ లేకుండా, ఇంకా నెగటివ్ ప్రచారంతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం రామ్ చరణ్ 'ధృవ'. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో జనతా గ్యారేజ్‌ను మించిపోవడం.. ఎన్టీఆర్ అభిమానులకే కాక, సినీ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. వైజాగ్‌లో జనతా హక్కులు రూ.5.1 కోట్లకు అమ్ముడుపోతే... ధృవ రూ.5.4 కొల్లగొట్టింది.