శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi

హాటెస్ట్ భామల మధ్య నలిగిపోయిన భళ్లాలదేవ

ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి హాటెస్ట్ భామల మధ్య నలిగిపోయాడు. బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవుడిగా న‌టించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన రానా... ప్ర‌స్తుతం ఈ హీరో ప‌లు

ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి హాటెస్ట్ భామల మధ్య నలిగిపోయాడు. బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవుడిగా న‌టించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన రానా... ప్ర‌స్తుతం ఈ హీరో ప‌లు వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తున్నాడు. 
 
తాజాగా, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ జీవిత నేప‌ధ్యంలో ‘1945’ అనే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను చేస్తున్నాడు. ఇదేకాక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రంలో కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ పాత్ర పోషించ‌నున్నాడు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో రూపొంద‌నుంది. వీటితో పాటు 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు.
 
అయితే బ‌హుభాషా న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా ఫ్యాష‌న్ ఐకాన్‌గాను మారాడు. తాజాగా ‘మాగ్జమ్’ మ్యాగజైన్ కోసం అతను ఇద్దరు హాట్ మోడల్స్‌తో కలిసి ఫోటోల‌కి ఫోజులిచ్చాడు. ఇందులో రానా జెంటిల్మెన్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ వైట్ లుక్ ఈ షూట్‌కు మరింత అందం తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.