ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 28 జులై 2017 (21:31 IST)

నాకు వాడే కావాలి... కాజల్ అగర్వాల్ లవ్‌లో పడిందా?

కాజల్ అగర్వాల్. ఈమె తెరపై కనిపిస్తే చాలామంది ఇప్పటికీ పడిచచ్చిపోతారు. హీరోల కన్నా హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్ళేవారు ఎక్కువమంది ఉంటారన్నది తెలిసిందే. మగధీర సినిమాతో తానేంటో నిరూపించుకున్న కాజల్ ఆ తరువాత వెను తిరిగి చూడనేలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగ

కాజల్ అగర్వాల్. ఈమె తెరపై కనిపిస్తే చాలామంది ఇప్పటికీ పడిచచ్చిపోతారు. హీరోల కన్నా హీరోయిన్ల కోసమే సినిమాలకు వెళ్ళేవారు ఎక్కువమంది ఉంటారన్నది తెలిసిందే. మగధీర సినిమాతో తానేంటో నిరూపించుకున్న కాజల్ ఆ తరువాత వెను తిరిగి చూడనేలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల హీరోయిన్ కాజల్. ప్రస్తుతం నేనే రాజు... నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న కాజల్ ప్రేమలో పడ్డారట. అది కూడా భల్లాల దేవుడితో.. ఇప్పటికే అర్థమై ఉంటుంది.. రానాతోనేని.
 
రానా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆరు అడుగుల హైట్‌తో సిక్స్ ప్యాక్ ధరించి సెక్సీగా కనిపించే హీరో. హీరోగా పెద్దగా అవకాశాలు రానాకు రాకున్నా బాహుబలిలో విలన్‌గా నిరూపించుకున్నారు. బాహుబలి తరువాత రానా నటించిన చిత్రం నేనే రాజు.. నేనే మంత్రి. ఈ సినిమాలో కాజల్ సెక్సీగా కనిపించనుంది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో నడిచే ఈ చిత్రంలో కాజల్ అందాలను ఆరబోయనుందట. 
 
అయితే సినిమా షూటింగ్ సమయంలోనే రానాకు, కాజల్‌కు మధ్య ప్రేమాయణం నడిచిందట. దీంతో కాజల్ రానానే పెళ్ళి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుందట. కానీ కాజల్ తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. ఇప్పుడే పెళ్ళి వద్దు. మరికొన్ని రోజులు ఆగు అని అడ్డుపడుతున్నారట. దీన్నిబట్టి చూస్తే రానా కాజల్ తండ్రికి నచ్చలేదా.. లేకుంటే కుమార్తెకు ఇప్పుడే పెళ్ళి చేయడం ఇష్టం లేదో అర్థం కాకుండా ఉంది. మొత్తం మీద కాజల్, రానాల ప్రేమ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా ఉంది.