శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:28 IST)

బాహుబలి నుంచి రానా ఔట్... ఇకపై తేజ చిత్ర షూటింగ్‌లో....

టాలీవుడ్ ఆజానుబాహుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో బిజీగా ఉంటూనే త్వరలోనే తన తదుపరి చిత్రం 'ఘాజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాహుబలి చిత్రంతో ఈ హీరోకి మంచి క్రేజ్‌ వచ్చి

టాలీవుడ్ ఆజానుబాహుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో బిజీగా ఉంటూనే త్వరలోనే తన తదుపరి చిత్రం 'ఘాజీ' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాహుబలి చిత్రంతో ఈ హీరోకి మంచి క్రేజ్‌ వచ్చింది. అతడితో సినిమాలు చేయడానికి ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్‌ వరకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు తేజతో సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాడు తేజ. ఈ సినిమా కోసం 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి తేజ నిర్మాతగాను వ్యవహరించనున్నాడు. 
 
ఈ చిత్రంలో రానా సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. తేజ సినిమాలకు ప్రారంభోత్సవాలు.. అప్‌ డేట్స్‌ లాంటివేమీ ఉండవని తెలిసిన విషయమే. గుట్టుచప్పుడు కాకుండా సినిమా మొదలుపెడతాడు... ఏ హడావుడి లేకుండా పూర్తి చేస్తాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని సినీనిపుణులు అంటున్నారు.