శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:34 IST)

వరసబెట్టి చేయాలంటే చేయలేను... ప్లీజ్ గ్యాప్ కావాలి... రెజీనా

అస్సలు గుక్క తిప్పుకోలేకున్నా.. నాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి.. నాకు ప్రశాంతత అవసరం. ఇది ప్రస్తుతం రెజీనా తనను కాల్షీట్ అడిగిన వారందరికీ చెబుతున్న మాటలు. తెలుగు సినీ పరిశ్రమలో బాగా బిజీ అయిపోయిన రెజీనాకు ప్రస్తుతం గ్యాప్ అవసరమట. అది కూడా ప్రశాంతంగా కొ

అస్సలు గుక్క తిప్పుకోలేకున్నా.. నాకు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి.. నాకు ప్రశాంతత అవసరం. ఇది ప్రస్తుతం రెజీనా తనను కాల్షీట్ అడిగిన వారందరికీ చెబుతున్న మాటలు. తెలుగు సినీ పరిశ్రమలో బాగా బిజీ అయిపోయిన రెజీనాకు ప్రస్తుతం గ్యాప్ అవసరమట. అది కూడా ప్రశాంతంగా కొన్ని రోజుల పాటు ఇంటివద్దే ఉండాలట. షూటింగ్‌ల పేరుతో ఇంటి పట్టున అస్సలు ఉండడం లేదట. తన వారిని బాగా మిస్సవుతోందట. 
 
పెద్ద డైరెక్టర్లకు ఇదే చెబుతోందట రెజీనా. సర్.. నేను మీ సినిమా చేస్తాను.. కానీ కొద్దిగా గ్యాప్ అవసరం. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకుంటాం. వరుసబెట్టి చేయాలంటే చేయలేను. గ్యాప్ ఇస్తేనే చేస్తానంటోందట. అయితే ఆమె అలా చెప్పడానికి మరో కారణం కూడా ఉందట. ఈమధ్య రెజీనా ఒకతడిని ప్రేమించిందట. ఆ ప్రేమ కాస్త విఫలమైందట. దాంతో కాస్త అసహనం ఫీలై సినిమాల మధ్య గ్యాప్ కావాలని రెజీనా అడుగుతున్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.