శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (13:26 IST)

అవును.. ఇంతకు ముందు ఒకరిని ప్రేమించాను: రెజీనా

ప్రస్తుతానికి తాను ఒంటరిగా వుండేందుకే ఇష్టపడతున్నానని అందాల తార రెజీనా వెల్లడించింది. జీవితంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుందని.. ఇన్నేళ్లపాటు సినిమా అనుభవంలో తాను గ్రహించింది అదేనని.. ఇలా మాట్లా

ప్రస్తుతానికి తాను ఒంటరిగా వుండేందుకే ఇష్టపడతున్నానని అందాల తార రెజీనా వెల్లడించింది. జీవితంలో ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుందని.. ఇన్నేళ్లపాటు సినిమా అనుభవంలో తాను గ్రహించింది అదేనని.. ఇలా మాట్లాడేందుకు కారణం ఏంటంటే? గత అనుభవాలేనని రెజీనా తెలిపింది. తానిలా వేదాంతాలు మాట్లాడేందుకు కారణం కూడా గత అనుభవాలేనని రెజీనా తెలిపింది. 
 
ఇంతకుముందు తాను ఒకరిని ప్రేమించానని.. ప్రస్తుతానికైతే తాను ఒంటరిగానే వున్నానని వెల్లడించింది. ప్రస్తుత జీవితమే తనకు బాగుందని చెబుతోంది. ప్రస్తుతం తాను తెలివిగా ఉన్నానని.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది కూడా అందుకేనని.. ఎవరితోనూ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం లేదని చెప్పింది. 
 
ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నట్లు రెజీనా తెలిపింది. కాగా, తెలుగులో రెజీనాకు ఆశించిన స్థాయిలో హిట్స్ లేకపోవడంతో కోలీవుడ్‌లో చేతినిండా ఆఫర్లతో రెజీనా బిజీ బిజీగా వుంది.