శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:42 IST)

పెళ్లి కాకుండానే గర్భవతి అయిన హీరోయిన్.. సీక్రెట్‌గా వివాహం?

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అందాలు ఆరబోసిన హీరోయిన్లలో ఒకరు రియా సేన్. అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె ఈమె. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ వివాహం

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అందాలు ఆరబోసిన హీరోయిన్లలో ఒకరు రియా సేన్. అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె ఈమె. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఎవ్వరికీ తెలీకుండా బుధవారం పుణెలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వివాహం చేసేసుకున్నారు.
 
అదీకూడా ఆగమేఘాలపై అత్యంత రహస్యంగా వివాహం జరిపించారు. బుధవారం నాడు పుణెలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో తమ పెళ్లి జరిగిపోయిందని ఈ జంట అధికారికంగా ప్రకటించి షాకిచ్చింది. కాగా, రియా గర్భవతి కావడంతోనే, ఆమె కుటుంబీకులు హడావుడిగా ఈ రహస్య వివాహాన్ని జరిపించినట్టు బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.
 
కాగా, హిందీలో పలు చిత్రాల్లో నటించిన రియా సేన్, తమిళంలో 'తాజ్ మహల్' చిత్రంలో నటించగా, ఆమె సోదరి రైమా తెలుగులో నితిన్ హీరోగా నటించిన 'ధైర్యం'లో తళుక్కుమన్న సంగతి విదితమే.