బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2016 (12:31 IST)

అసలే ఆయన పెద్ద డైరెక్టర్... నేను ఎలా బుట్టలో పడేశానో తెలుసా.. లవ్ స్టోరీ చెప్పిన రోజా

ప్రముఖ సినీ నటి రోజా సినిమాల్లో కంటే రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు టి.వీ షో 'జబర్దస్త్' ఖతర్నాక్ కామెడీ షో లో నాగబాబుతో కలిసి జడ్జి‌గా కూడా వ్యవహరిస్త

ప్రముఖ సినీ నటి రోజా సినిమాల్లో కంటే రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు టి.వీ షో 'జబర్దస్త్' ఖతర్నాక్ కామెడీ షో లో నాగబాబుతో కలిసి జడ్జి‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ రచ్చబండ కార్యక్రమం ద్వారా తానేంటో నిరూపించుకుంది. రోజా కెరియర్ ప్రారంభించినప్పుడే తమిళ దర్శకుడు సెల్వమణి‌ని ఇష్టపడింది. దాదాపు పదేళ్ళ  ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అటువంటి సెల్వమణి గురించి రోజా షాకింగ్ నిజాలను అందరి ముందు చెప్పింది. 
 
సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు చెప్పకుండా రోజా నాన్నగారి దగ్గరకు వెళ్లి ఒప్పించుకొని ఆ తర్వాత రోజాకు చెప్పాడట సెల్వమణి. సెల్వమణి రోజా ఏం చేసిందో తెలుసా.... ఆయన కోసం తమిళం మాట్లాడటం, చదవటం కూడా నేర్చుకుందట. ఎందుకు అంత కష్టపడ్డారని అడిగితే... అసలే ఆయన పెద్ద డైరెక్టర్. నేను బుట్టలో పడేసాను కదా! అలాగే వేరే ఎవరైనా ఆయనకి లెటర్ రాసి బుట్టలో పడేస్తారేమో అని  నవ్వేసింది. 
 
సెల్వమణిగారికి ఇష్టమైన రంగు ఏమిటని అడిగితే...తండ్రి కొడుకులిద్దరికి బ్ల్యూ పిచ్చి అని చెప్పింది. అంతేకాక సెల్వమణికి సైలెంట్‌గా ఉండే స్థలాలంటే చాలా ఇష్టమట. అందుకే ఇంటిలో ఒక గదిని సైలెంట్‌గా ఉంచుతారట. అంతే కాదు సెల్వమణికి రోజా కంటే శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టమట.