బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (11:51 IST)

అక్కినేని నాగార్జునను తాకిన నోట్ల కష్టాలు.. ఎస్ఎస్ఎస్ కలెక్షన్స్ డౌన్.. చైతూ, అఖిల్ పెళ్ళి ఎలా?

టాలీవుడ్‌ను నోట్ల రద్దు వ్యవహారం కుదిపేసింది. సినిమాల రిలీజ్‌పై టాలీవుడ్ సినిమాలు కష్టాలు తప్పలేదు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్న నేపథ్య

టాలీవుడ్‌ను నోట్ల రద్దు వ్యవహారం కుదిపేసింది. సినిమాల రిలీజ్‌పై టాలీవుడ్ సినిమాలు కష్టాలు తప్పలేదు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్న నేపథ్యంలో.. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చు కోవడానికి నల్ల కుబేరులు నానా తంటాలు పడుతున్నారు. 
 
మరోవైపు సామాన్య ప్రజలు నిత్యావసరాలకు డబ్బులు లేక బ్యాంక్‌లు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ నోట్ల తంటాలు సినీ ఇండస్ట్రీని తాకింది. నిత్యావసరాలకు డబ్బులు లేక సినిమా చూసే వాళ్ళు కూడా బాగా తక్కువ అయిపోయారు. నోట్ల రద్దుతో అక్కినేని నాగార్జునకు బాగా దెబ్బ కొట్టింది. అక్కినేని నాగ‌చైత‌న్య సాహసం శ్వాసగా సాగిపో సినిమా శుక్రవారం విడుదల అయింది. 
 
ఇటీవల చైతూకి చాలా కాలం తరవాత ప్రేమమ్ సినిమా హిట్ అవ్వడంతో.. వరుసగా రెండో హిట్ కొడదామని చైతూ ఎంతో ఆశపడ్డాడు. మోడీ పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంతో జనాలు డబ్బులు ఖర్చుపెట్టి సినిమాకి రావడం కష్టంగా మారింది. వంద రూపాయల నోట్ల కోసం జనాలు అల్లాడుతున్న నేపథ్యంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. మరోవైపు నాగచైతన్య, అఖిల్ వివాహాన్ని ఎలా జరపాలోనని నాగార్జున డైలమాలో పడినట్లు తెలుస్తోంది. మరి నాగార్జున నోట్ల కష్టాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.