ఆ సన్నివేశాలను 'సన్నాఫ్ సత్యమూర్తి' కోసం కాపీకొట్టారా?

trivikram srinivas
DV| Last Updated: శనివారం, 11 ఏప్రియల్ 2015 (18:57 IST)
తెలుగు సినిమాలు ఏదో హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితో తీస్తుంటారు. అయితే అందులో కొన్ని సన్నివేశాలు చాలా మటుకు తెలుగు సినిమాలోని పాతవే కాపీ చేస్తుంటారు. బాలీవుడ్‌ కూడా చేసిన సందర్భాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌ సన్నాఫ్ కృష్ణమూర్తిలో కూడా ఓ సీన్‌ 'తారా రమ్‌పమ్‌' చిత్రంలోని సన్నివేశాన్ని కాపీ చేసినట్లు రూఢీ అయింది.

దీన్ని విమర్శకులు వేలెత్తి చూపిస్తున్నారు. హీరో తన
తండ్రి మరణం తర్వాత ఆస్తులు, బంగళాలు అప్పులవాళ్లకు వదిలేసి, ఓ సాధారణమైన ఇంట్లోకి కుటుంబంతో వస్తాడు. అప్పుడు హీరో అన్న కూతురు ఈ ఇల్లు ఏమీ బాగాలేదని ఏడుస్తూ గొడవ చేస్తుంది. అప్పుడు ఆమెకు బన్నీ సర్దిచెప్పే క్రమంలో 'ఇది ఓ రియాల్టీ షో....ఇందులో నువ్వు బాగా నటిస్తే బోలెడన్ని చాక్లెట్స్‌.. ఐస్‌క్రీమ్‌లు ఇస్తారని నమ్మిస్తాడు.

ఇలాంటి సన్నివేశమే బాలీవుడ్‌ మూవీ సినిమాలో ఉంది. ఇందులో కార్‌ రేసర్‌ అయిన సైఫ్‌ అలీ ఖాన్‌ ఆస్తులన్నీ కోల్పోతాడు. ఇలాగే చిన్న ఇంట్లోకి వస్తాడు. ఆయన కూతురు కూడా ఇలానే గొడవ చేస్తే ఇది ఓ రియాల్టీషో... ఇందులో మనం పాత్రధారులం అని నమ్మిస్తాడు. సో. దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా కాపీ మాస్టరేనని తెలుస్తోంది. దీనిపై ఆయన ఎటువంటి వివరణ ఇస్తాడో చూద్దాం.దీనిపై మరింత చదవండి :