శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: గురువారం, 8 డిశెంబరు 2016 (20:15 IST)

నాగార్జున కోడలు కదా.. ఎందుకులే అనుకుంటున్నారు... సమంత

హీరోల కంటే హీరోయిన్లు వివాహం చేసుకుంటున్నారంటే సినిమాలు తగ్గుతాయి. అందులో తానేమీ మినహాయింపు కాదని సమంత తెలియజేస్తుంది. వివాహం తర్వాత నటిస్తానని ఆమధ్య ప్రకటించిన సమంతా ఇటీవలే ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటున్నట్లు వార్త వచ్చిన దగ్గర నుంచి త

హీరోల కంటే హీరోయిన్లు వివాహం చేసుకుంటున్నారంటే సినిమాలు తగ్గుతాయి. అందులో తానేమీ మినహాయింపు కాదని సమంత తెలియజేస్తుంది. వివాహం తర్వాత నటిస్తానని ఆమధ్య ప్రకటించిన సమంతా ఇటీవలే ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటున్నట్లు వార్త వచ్చిన దగ్గర నుంచి తనకి ఆఫర్లు తగ్గిపోయాయని ఓ ఇంటర్వ్యూలో సమంతా చెప్పింది. 
 
వరుస హిట్లు ఉన్నప్పటికీ, నాగార్జున కోడలు కదా.. ఎందుకులే.. అని కొంతమంది తనకి ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తిని చూపడం లేదని పేర్కొంది. పెళ్లి తరువాత సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, నాగార్జున- చైతూ ఇద్దరూ కూడా తమకి అభ్యంతరం లేదన్నారని చెప్పింది. అయినా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నారని అంది. సినిమాల సంగతి ఎలా వున్నా తనకి మంచి ఫ్యామిలీ దొరికిందనీ, ఆ ఫ్యామిలీతో తన లైఫ్‌ ఆనందంగా వుంటుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.