గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (18:27 IST)

సమంత, నాగచైతన్యల నిశ్చితార్థం నేడే.. నా మూడ్ ఇదే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..

టాలీవుడ్ ప్రముఖ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత నిశ్చితార్థం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. వీరిద్దరి నిశ్చితార్థం సోమవారం జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త బయటకు పొక్

టాలీవుడ్ ప్రముఖ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత నిశ్చితార్థం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. వీరిద్దరి నిశ్చితార్థం సోమవారం జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త బయటకు పొక్కకుండా అక్కినేని కుటుంబం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

నిశ్చితార్థం జరుగనున్న నేపథ్యంలో సమంత ఆనందం పట్టలేక ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రస్తుతం నా మూడ్ ఇదే’ అంటూ క్యాప్షన్ కూడా తగిలించింది. సమంత ఆనందానికి కారణం ఆదివారం చైతూతో నిశ్చితార్థం జరగనుండడమేనని అభిమానులు ఓ అంచనాకొచ్చారు. 
 
అంతే.. నిశ్చితార్థం సందర్భంగా అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. చిన్న పిల్లలా చిందులేస్తున్న సమంతను చూస్తున్న అభిమానులు ఆమె చాలా అందంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిశ్చితార్థం సందర్భంగా ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 23న పెళ్ళి ముహూర్తం కుదుర్చుకున్నారని, హైదరాబాద్‌లోని నొవోటెల్‌లో ఈ వేడుకను నిర్వహించనున్నారని కొందరు చేసిన ట్వీట్‌కు సమంత రిప్లై ఇచ్చారు.