బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (15:24 IST)

సానియా మీర్జా (An Untold story) సినిమాలో నటిస్తోందా....?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ క్రీడతో పాటు గ్లామర్ ప్రపంచంలోనూ అడుగుపెట్టబోతుందా...? అంటే అవుననే అంటున్నారు. ఆమె స్వస్థలం హైదరాబాద్ అయినప్పటికీ సినీ ఎంట్రీ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చేయనుందని చెప్పుకుంటున్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అక్తర్ చేసిన ట్వీట్ ద్వారా ఇక సానియా మీర్జా సినీ ఎంట్రీ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ మాదిరిగానే సానియా మీర్జా (An Untold story) చిత్రాన్ని తెరకెక్కిస్తారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో సానియా తండ్రి తన కుమార్తెను ఓ క్రీడాకారిణిగా ఎలా తీర్చిదిద్దాడన్నది ఇతివృత్తంగా సాగుతుందని సమాచారం. ఇందులో సానియా మీర్జానే నటిస్తుందట.