శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (15:48 IST)

'శ్రద్ధ'గా ఎక్స్‌పోజింగ్‌.. అందాల ఆరబోతకు అడ్డే లేదంటోంది!

నటి శ్రద్ధాదాస్‌ ఏది చేసినా శ్రద్ధగా చేస్తుంది. గ్లామర్‌ పాత్రలు చేయడంలో వెనుకడుగు వేయని ఈ నటి... ఆమధ్య జగపతిబాబులో లిప్‌కిస్‌ను కూడా లాగించేసింది.

నటి శ్రద్ధాదాస్‌ ఏది చేసినా శ్రద్ధగా చేస్తుంది. గ్లామర్‌ పాత్రలు చేయడంలో వెనుకడుగు వేయని ఈ నటి... ఆమధ్య జగపతిబాబులో లిప్‌కిస్‌ను కూడా లాగించేసింది. ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు నిర్మించిన 'బ్యాంక్‌రాబరీ' నేపథ్యంలో ఆమె నటించింది. ఎందుకనో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. ఇటీవలే రివాల్వర్‌ రాణితో చక్కటి గ్లామర్‌ ఒలకపోసింది. కానీ ఫలితంలేకుండా పోయింది. 
 
ఇప్పుడు మరో సెక్సీపాత్ర చేయడానికి అంగీకరించింది. గుంటూరు టాకీస్‌లో సెక్సీగా కన్పించిన శ్రద్దా.. ఇప్పుడు అదే దర్శకుడు చేయబోయే చిత్రంలో మంచి ఛాన్స్‌ కొట్టేసింది. ఆమెనే పిలిపించుకుని ఆఫర్‌ ఇచ్చాడు. రాజశేఖర్‌ హీరోగా చేయబోయే సినిమాలో ఆమె పాత్రను డిజైన్‌ చేశాడు. రాజశేఖర్‌ను వలలోవేసుకునే పాత్ర అది. ఇప్పటికే రాజశేఖర్‌.. పూజ అనే హీరోయిన్‌ ఎంపిక చేశారు. మరి శ్రద్ధ వాంప్‌గా చేస్తుందేమో కొద్దిరోజుల్లో తెలియనుంది.