సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (14:27 IST)

మ‌హేష్ 25వ మూవీలో శ్రుతి హాసన్ స్పెష‌ల్ సాంగా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందుతోన్న ఈ సినిమాని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల డెహ్ర‌డూన్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. మ‌హేష్ బాబు పైన కాలేజ్ సీన్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందుతోన్న ఈ సినిమాని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల డెహ్ర‌డూన్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. మ‌హేష్ బాబు పైన కాలేజ్ సీన్స్ చిత్రీక‌రించారు. పూజా హేగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌.
 
పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు..., దూకుడు సినిమాలో ఆటో అప్పారావు..., వన్‌ నేనొక్కడినే చిత్రంలో లండన్‌ బాబులు, ఆగడులో జంక్షన్‌లో.. పాట‌లు ఎంత పాపుల‌ర్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్ కూడా వాట‌న్నింటి కంటే ఎక్కువ పాపుల‌ర్ అయ్యాలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. 
 
ఆల్రెడీ దేవిశ్రీ ట్యూన్ కూడా రెడీ చేసేసాడ‌ట‌. అయితే... ఈ పాట‌లో న‌టించే హీరోయిన్ ఎవ‌రైతే బాగుంటుందో ఆలోచిస్తున్నార‌ట‌. ఇంకా ఎవ‌రిని ఫైన‌ల్ చేయ‌లేద‌ట‌. కానీ కొంతమంది శ్రుతి హాసన్ అయితే బాగుంటుంది అని చెపుతున్నారట. మరి మహేష్ బాబు ఏమని చెప్తారో?