చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్.. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా అంటూ?
మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్) జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది ఈ నేపథ్యంలో.. చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్
మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్) జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది ఈ నేపథ్యంలో.. చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్ రెడీ అవుతోంది. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. అంటూ సాగే పాట నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.