శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (14:33 IST)

''Surya I Love U'' అంటున్న 'ఫిదా' భామ సాయిపల్లవి

ఒక్క తెలుగు చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న భామ సాయిపల్లవి. నిజానికి ఈమె తమిళ అమ్మాయి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" చిత్రంలో నటించి ఎక్కడలేని పేరును సంపాదించుక

ఒక్క తెలుగు చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న భామ సాయిపల్లవి. నిజానికి ఈమె తమిళ అమ్మాయి. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" చిత్రంలో నటించి ఎక్కడలేని పేరును సంపాదించుకుంది. అయితే, ఈ అమ్మడుకి తెలుగు హీరోల్లో ఒక్కరు కూడా ఫేవరేట్ హీరో లేరట. కానీ, తమిళంలో మాత్రం ఒక్క హీరో ఉన్నాడట. 
 
ఆ హీరో ఎవరో కాదు... తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌గా ఎదిగిన సూర్య. తాను కాలేజ్ రోజుల నుంచి సూర్యకు వీరాభిమానినని, సూర్య సినిమా విడుదలైతే చాలు ఫస్ట్ రోజే చూసేందుకు కాలేజీకి డుమ్మాకొట్టి వెళ్లేదానని చెప్పింది. ఛాన్స్ వస్తే సూర్యతో కలిసి నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని సాయిపల్లవి తెలిపింది. పైగా, సూర్య అన్నా.. ఆయన నటన అన్నా తనకు ఎక్కడలేని ప్రేమ, పిచ్చి అని చెప్పుకొచ్చింది.