శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 25 మే 2017 (13:50 IST)

రాజమౌళి 'మగధీర'ను కాపీ కొట్టేశారా...? ఎంఎస్ ధోనీ హీరో సినిమా కష్టాలు...

ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్

ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీతో పాపులర్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ నటించిన తాజా చిత్రం రాబ్తా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం అచ్చం రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రాన్ని పోలి వున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్-కాజల్ అగర్వాల్ గత జన్మలో ప్రేమికులుగా నటిస్తారు. ఆ జన్మలో వాళ్లిద్దరూ సేనాధిపతి-యువరాణిగా నటించారు.
 
అలాంటి ఫార్ములాతోనే సుశాంత్ రాజ్‌పుత్ రాబ్తా తెరకెక్కినట్లు ఇటీవలి సినీ పోస్టర్లు, ట్రెయిలర్స్ చూస్తే అర్థమవుతుందనీ, అందువల్ల మగధీర చిత్ర నిర్మాతలు కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాబ్తా చిత్రం విడుదల నిలుపుదల చేయాల్సిందిగా కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.