బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 4 ఫిబ్రవరి 2017 (21:00 IST)

తమన్నా పుకార్లకు దూరమా...?!

హీరోయిన్లు అన్నాక రూమర్లు మామూలే. కానీ తమన్నా విషయంలో కొంత మినహాయింపు వున్నట్లు కన్పిస్తోంది. అప్పట్లో తమన్నా బాలీవుడ్‌ దర్శకుడితో ఏదో వ్యవహారం అంటూ గాసిప్‌ వచ్చింది. ఆ తర్వాత మరెలాంటివి రాలేదు. నటన, అంకితభావం, ఎంచుకున్న పాత్రలు తనపై రూమర్లు పెద్దగా

హీరోయిన్లు అన్నాక రూమర్లు మామూలే. కానీ తమన్నా విషయంలో కొంత మినహాయింపు వున్నట్లు కన్పిస్తోంది. అప్పట్లో తమన్నా బాలీవుడ్‌ దర్శకుడితో ఏదో వ్యవహారం అంటూ గాసిప్‌ వచ్చింది. ఆ తర్వాత మరెలాంటివి రాలేదు. నటన, అంకితభావం, ఎంచుకున్న పాత్రలు తనపై రూమర్లు పెద్దగా రాకపోవడానికి కారణమని చెబుతోంది. పైగా రూమర్లు రాసేవారిపైన కూడా చురకలు వేస్తోంది. 
 
హీరోయిన్లకు ఓ కుటుంబం వుంటుంది. అది గుర్తుంచుకుని ప్రచారం చేయవద్దని చెబుతోంది. నటీనటుల జీవితం మిగతవారిపై భిన్నంగా వుంటుంది. ప్రతి విషయం ప్రేక్షకుల్లో ఆసక్తి ప్రదర్శిస్తారు. వారు వేసుకునే దుస్తులు, అభిప్రాయాలు సామాన్యులు అనుసరించాలని అనుకుంటారు. అందుకే గాసిప్‌వల్ల వారు మనస్తాపానికి గురవుతారు. 
 
అభిమానించేవారు అంతకంటే ఇబ్బంది పడతారు. కొందరు గాసిప్స్‌ను పట్టించుకోరు. కానీ ఎవరో ఒకరు కనబడినప్పుడల్లా అడుతుంటారు. తేలిగ్గా కొట్టిపారేస్తే.. మళ్ళీ ఏదో ఊహించుకుని రాసేస్తారు. నేను నటిగా మంచి పాత్రలు చేయాలనే ఈ రంగంలోకి వచ్చాను. మిగిలిన విషయాలను పట్టించుకోనని స్పష్టం చేసింది.