శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (15:40 IST)

నితిన్ చిత్రం కోసం జిమ్‌లో కష్టపడుతున్న తమన్నా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌తో నటించిన సిటీమార్ చిత్రంలో నటించి విక్టరీ వెంకీ చిత్రం ఎఫ్ 3 చేస్తోంది. మరోవైపు హీరో నితిన్‌తో ఓ చిత్రం కమిట్ అయిందట.
 
నితిన్ పక్కన క్యూట్ లుక్స్ కోసం జిమ్ సెంటర్లో గంటలకొద్దీ కష్టపడుతోందట ఈ బ్యూటీ. వ్యాయామం చేస్తున్న ఫోటోలను తన ఇన్ స్టా పేజీలో వదిలింది మిల్కీబ్యూటీ. దానితో పాటు ఓ స్లోగన్ కూడా పెట్టింది. మన మనసు ఏం సాధించాలనుకుంటుందో దాన్ని మన శరీరం సాధిస్తుంది అని. నిజమే కదా.