శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (13:36 IST)

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్ "భూమిక" చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేసిన త‌మన్నా

తమిళంతో పాటు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుత‌న్న హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్ మ‌రో థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. "భూమిక" అనే టైటిల్‌తో తెరకెక్క‌నున్న ఈ థ్రిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్‌కి 25వ సినిమా కావ‌డం విశేషం.
 
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్ న‌టించిన పెంగ్విన్ చిత్రం విడుద‌లైంది.
 
కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాను నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం థ్రిల్ ఫీల్ అయ్యే స‌న్నివేశాల‌తో భూమికను తెర‌కెక్కిస్తున్నాట్లుగా నిర్మాత సుదాన్ తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అఫీషియ‌ల్ ఎనౌన్స్ చేస్తామ‌ని అన్నారు.
 
 
 
తారాగ‌ణం: 
 
ఐశ్వ‌ర్య రాజేశ్
 
, బ్యానర్లు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ 8 స్టూడియోస్; 
నిర్మాత‌లు -కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం - ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్.