మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా.. హైదరాబాదులో తెరకెక్కనున్న భారీ షెడ్యూల్...
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో భారీ షెడ్యూల్ తెరకెక్కుతోంది.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించే కథానాయిక ఎవరు? అన్న సస్పెన్స్ ఇన్నాళ్లు కొనసాగింది. చిరు సరసన పలువురు అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. నయనతార, అనుష్క, శ్రియ .. వీరిలో ఎవరో ఒకరు నటించే ఛాన్సుందని కథనాలొచ్చాయి. అయితే వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ కాజల్‌ని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాలో విలన్ ఎవరనేది తేలిపోయింది. గతంలో తన సరసన హీరోయిన్‌గా నటించిన అంజలి జవేరి భర్తనే చిరంజీవి… తన రీఎంట్రీ మూవీలో విలన్‌గా పెట్టుకున్నాడు. సినిమాల నుంచి తప్పుకున్న అంజలీ జవేరీ… మోడల్ తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుంది. తర్వాత తరుణ్ మోడలింగ్ నుంచి సినిమాలకు షిఫ్ట్ అయ్యారు.
''జబ్ వియ్ మెట్''తో పాటు మరెన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఇతడ్నే చిరంజీవి 150వ సినిమాలో విలన్‌గా ఫిక్స్ చేశారు. నిజానికి చిరు సినిమాలో జగపతిబాబును విలన్‌గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత వివేక్ ఒబరాయ్, నీల్ నితిన్ ముఖేష్ పేర్లు కూడా వినిపించాయి. తనకు స్టోరీలైన్ నచ్చలేదని జగపతిబాబు తన సన్నిహితుల మధ్య ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. మొత్తమ్మీద వీళ్లందర్నీ కాదని తరుమ్ అరోరాను చిరు 150వ సినిమాలో విలన్‌గా ఫిక్స్ చేశారు. మొత్తమ్మీద అంజలా జవేరీ మొగుడు అద్భుతమైన అవకాశమే కొట్టేశాడు.