ఈ తరుణ్ భాస్కర్‌కు ఏమైంది? హీరోగా చేస్తున్నాడట... దర్శకుడెవరంటే?
పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి ప్రయత్నంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. తర్వాత సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే చేయనున్నాడు. రానాతో ఉంటుందని ప్రచారం జరిగింది కానీ... ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే... తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటుడుగా మారి ఓ సినిమా చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే... తీవ్రవాద నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ఇందులో తరుణ్ భాస్కర్ హైదరాబాద్ పాతబస్తీ యువకుడిగా కనిస్తారని టాక్. తమిళ యువకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలిసింది.
చిత్ర పరిశ్రమకు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమైనా… నటుడిగా కెరీర్ స్టార్ట్ చేస్తుండటం విశేషం. మరి.. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ నటుడిగా ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.