శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (16:04 IST)

నాగ చైతన్య, రామ్ తప్పించుకు తిరుగుతున్నారట... శ్రీను వైట్ల ఇల్లు అమ్ముకున్నాడు...

ప్లానింగ్ లేకపోతే కష్టమండీ. అది కుటుంబం అయినా సరే లేదా వ్యాపారం అయినా సరే. ఓ ప్రణాళిక లేకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెడితే మునిగిపోవడం ఖాయం. ఇదివరకు కవిగారు అన్నట్లు కొండలైనా కరిగిపోవును... అది కూర్చుని తిన్నాసరే లేదంటే ఇష్టం వచ్చినట్లు ఖ

ప్లానింగ్ లేకపోతే కష్టమండీ. అది కుటుంబం అయినా సరే లేదా వ్యాపారం అయినా సరే. ఓ ప్రణాళిక లేకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఖర్చు పెడితే మునిగిపోవడం ఖాయం. ఇదివరకు కవిగారు అన్నట్లు కొండలైనా కరిగిపోవును... అది కూర్చుని తిన్నాసరే లేదంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టినాసరే. ఇదంతా ఎందుకంటే... టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల తను గొప్పగా అనుకుని తీసిన మిస్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడిపోవడంతో తను కొనుక్కున్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది. 
 
విషయం ఏంటయా అంటే... మిస్టర్ చిత్రం తీసేటపుడు ఆ చిత్ర నిర్మాతలు ఫిక్స్‌డ్ బడ్జెట్ నిర్దేశించారట. అంతకుమించి ఒక్క పైసా కూడా ఖర్చు చేసే ఆలోచనే తమకు లేదని తేల్చి చెప్పారట. ఐతే శ్రీను వైట్ల మాత్రం... తన కథకు అనుకున్న స్థాయిలో డబ్బు పెట్టాల్సిందేననీ, లాభాల పంట పండుతుందని చెప్పాడట. ఐతే... బడ్జెట్ పెంచేందుకు నిర్మాతలు ససేమిరా అనడంతో... తేడా వస్తే ఆ డబ్బును తనే భరిస్తానని అగ్రిమెంట్ వేశాడట శ్రీను వైట్ల. 
 
ఇంకేముంది... శ్రీను చెలరేగిపోయాడట. దాదాపు కోటి రూపాయల మేర అదనపు ఖర్చు పెట్టేశాడట. తీరా చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద ఈగలు తోలుకుంది. దానితో ఇక చేసేది లేక కొనుక్కున్న ఇల్లు అమ్మేసి మిస్టర్ చిత్ర నిర్మాతలకు ఇటీవలే చెల్లించాడట. ఐనా ఆ అప్పు తీరకపోవడంతో మరో 85 లక్షల రూపాయలు అప్పు చేసి వారికి కట్టాడట. 
 
అసలే బొమ్మతో పనాయె... ఉన్నదాంటో చేస్కుంటే పోయేది. అనవసరంగా బడ్జెట్ పెంచేసి నిర్మాతలకు, హీరోతో పాటు తనకు కూడా కష్టాన్ని కొనుక్కున్నాడు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలావుంటే శ్రీను వైట్లతో సినిమా చేస్తామన్న నాగ చైతన్య, రామ్ తదితర యువ హీరోలు ఆయన కనబడితే తప్పించుకుని తిరుగుతున్నారట. ఏం చేస్తాం...?