శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

బోల్డ్ క్యారెక్టర్‌లో సత్తా చూపిస్తానంటున్న రంగమ్మత్త

తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అంతకంతకి క్రేజ్ విపరీతంగా పెంచుకుంటోంది. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలలో మంచి పాత్రలు చేసి పాపులారిటి తెచ్చుకుంది. 
 
ఆ తర్వాత పలు వరుస చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. బోల్డ్ క్యారెక్టర్ అయినా తన సత్తా చూపించేసి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం రంగ 'మార్తాండ', రవితేజ 'ఖిలాడి" సినిమాలున్నాయి. ఇలా మంచి క్యారెక్టర్స్‌లో సందడి చేస్తూనే స్పెషల్ నంబర్స్‌ చేస్తోంది. 
 
రీసెంట్‌గా 'చావుకబురు చల్లగా' సినిమాలో స్పెషల్ నంబర్‌లో కనిపించిన అనసూయ శర్వానంద్, సిద్దార్థ్ నటిస్తున్న 'మహాసముద్రం'లో కూడా ఒక స్పెషల్ నంబర్‌లో కనిపించబోతోందట. మొత్తానికి ఒకవైపు బుల్లితెర మీద మరొక వైపు బిగ్ స్క్రీన్ మీద గ్లామర్ ట్రీట్ ఇస్తూ చాలా బిజీగా ఉంటోంది.
 
అయితే, ఆమెకు సినిమాల్లో వరుస ఆఫర్లు రావడం వెనుక కారణాలను విశ్లేషిస్తే.. బుల్లితెర మీద అద్భుతంగా సందడి చేస్తోంది. తద్వారా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ విపరీతమైన క్రేజ్‌తోనే వరుస చిత్రాల్లో ఆఫర్లు కొట్టేస్తుందన్న టాక్ ఉంది.