ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జూన్ 2017 (14:13 IST)

జక్కన్న ముసిముసి నవ్వులు... అల్లు అరవింద్ కుతకుత... కోటిన్నర కారులో రాజమౌళి(వీడియో)

బాహుబలి దెబ్బకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగని రాజమౌళికి ఏమీ కొమ్ములు రాలేదండోయ్. ఇదివరకు ఎలాగున్నారో సేమ్ టు సేమ్ అలాగే వున్నారు. కాకపోతే దర్శకుడిగా తన స్థాయి జాతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకూ వెళ్లిపోయింది. ఈ నేపధ్

బాహుబలి దెబ్బకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగని రాజమౌళికి ఏమీ కొమ్ములు రాలేదండోయ్. ఇదివరకు ఎలాగున్నారో సేమ్ టు సేమ్ అలాగే వున్నారు. కాకపోతే దర్శకుడిగా తన స్థాయి జాతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకూ వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో సహజంగానే రాజమౌళి తదుపరి చిత్రం ఏంటా అని అందరూ ఆలోచన చేయడం సహజమే. 
 
దానయ్య నిర్మాతగా అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ దీనిపై రాజమౌళి క్లారిటీ ఇవ్వడంలేదు. కథ రెడీ అవుతోందనీ, తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను పూర్తి చేయగానే పని మొదలుపెడతానని అంటున్నారు. అలాగే నిర్మాత దానయ్యకు సినిమా చేస్తున్నట్లు కూడా చెపుతున్నారు కానీ హీరో ఎవరంటే మాత్రం ముసిముసిగా నవ్వుతారు. 
 
ఆ ముసిముసి నవ్వులే అల్లు అరవింద్‌కు కుతకుతలాడిస్తున్నట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి కారణం దానయ్య చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తారంటూ వస్తున్న వార్తలే. ఈ వార్తలను రాజమౌళి ధృవీకరించడంలేదు మరి. ఇదిలావుంటే తాజాగా రాజమౌళి కోటిన్నర రూపాయలు వెచ్చించి కారు కొనుక్కుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారట. చూడండి ఆ కారు సమాచారం ఈ వీడియోలో...