పవన్‌పై త్రిష ప్రశంసలు.. స్టార్‌డమ్‌కు దూరంగా ఉన్న ఒకే ఒక్క మగాడు
'వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది చెన్నై భామ త్రిష. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా ఏ మాత్రం ఆగకుండా తనదైన స్పీడుతో వరుస సినిమాలు చేస్
'వర్షం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది చెన్నై భామ త్రిష. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయినా ఏ మాత్రం ఆగకుండా తనదైన స్పీడుతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుందీ తీన్మార్ బ్యూటీ.
ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఓ అభిమాని త్రిషను పవన్‌కల్యాణ్ గురించి ఒకమాటలో చెప్పాలంటే? ఏం చెబుతారు అని అడిగాడు.
అందుకు త్రిష 'ఒకే ఒక్కడు' అని ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తారని పేర్కొంది. స్టార్‌డమ్‌కు పవన్ దూరంగా చాలా సింపుల్‌గా హుందాగా ఉంటారని చెప్పింది. ఇంకా తనకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టమని, ఇటీవల వచ్చిన సినిమాల్లో తనకు సుల్తాన్ హిందీ చిత్రం నచ్చిందని చెప్పింది.
'మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగితే ఇష్టం ఉండదు?' అని తన అభిమాని వేసిన ప్రశ్నకు తనను ఎవరయినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగితే ఆ ప్రశ్న ఇష్టం ఉండదని సమాధానం చెప్పింది. హీరో మహేష్‌బాబు గురించి అడిగిన ప్రశ్నకు... వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్ సూపర్‌స్టార్ అని త్రిష పొగడ్తల వర్షాన్ని కురిపించింది.