వికారాబాద్ అడవుల్లో డైరెక్టర్ క్రిష్.. ఇంతకీ.. అక్కడ ఏం చేస్తున్నాడు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో క్రిష్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న సమయంలో కరోనా రావడంతో షూటింగ్ ఆగింది. ఇది పాన్ ఇండియా మూవీ. దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
ఇదిలావుంటే, డైరెక్టర్ క్రిష్ వికారాబాద్ అడవుల్లో ఉన్నారు. అదేంటి.. క్రిష్ ఇప్పుడు వికారాబాద్ అడవుల్లో ఉండడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే... కరోనా కారణంగా షూటింగ్స్ ఆగాయి. పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న మూవీ షూటింగ్ 2021లోనే ఉంటుంది.
ఈలోగా మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో సినిమా ప్లాన్ చేసాడు. సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ సినిమా. ఇందులో పులులు, సింహాలతో ఫైటింగ్స్ కూడా ఉంటుందట. మరి.. ఈ సినిమాతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.