సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (23:02 IST)

జయ జనార్థనా కృష్ణా రాధికాపతే జన విమోచనా కృష్ణా జన్మ మోచన

శ్రీకృష్ణ జన్మాష్టమి మంగళవారం అని కొందరు కాదు బుధవారం అని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద చిన్నికృష్ణుడి బుడిబుడి అడుగులు ఈ రెండు రోజులు తమతమ ఇళ్లలోకి వస్తాయని పండుతులు అంటున్నారు. కాబట్టి రెండు రోజులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగనున్నాయి. ఆ జనార్థనుడిని శరుణ వేడుదాం.
 
జయ జనార్థనా కృష్ణా రాధికాపతే 
జన విమోచనా కృష్ణా జన్మ మోచన 
 
గరుడ వాహనా కృష్ణా గోపికాపతే
నయన మోహనా కృష్ణా నీరజేక్షణ  
సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే 
మదన కామనా కృష్ణా మాథవా హరే   || జయ ||
 
మథుర ధీపతే కృష్ణా వాసవానుజ 
వరగుణాంతకా కృష్ణా వైష్ణావాకృతే
సురచిరాననా కృష్ణా శౌర్య  వారిధే
మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా   || జయ ||
 
విమల బాలకా కృష్ణా వల్లభీపతే 
కరుణ లోచనా కృష్ణా కామదాయకా 
కువల యేక్షణా కృష్ణా కామనాచ్యుతే
చరణ వల్లభం కృష్ణా శరణు ముకుందా   || జయ ||